వీడియోను దాటవేయి

వివిధ రాజకీయ శక్తుల పరస్పర చర్య

మొదటి నిజాం బ్రిటిష్ ఫ్రెంచ్ వారిని కూడా దూరం ఉంచాడు. అయితే అతని తరవాత వచ్చిన పాలకులు, తొలి నిజాం కుమారులు మనుమల మధ్య వారసత్వానికి సంబంధించిన వివాదాల వల్ల ఫ్రాన్స్ బ్రిటిష్ వారిని దూరం ఉంచలేకపోయారు. 1768లో నిజాం అలీ ఖాన్ కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నామమాత్రం మొత్తానికి లీజుకు ఇచ్చాడు. బదులుగా బేరార్ ని మరాఠాల నుంచి తిరిగి గెలుచుకునేందుకు, మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తనకు సైనిక సహాయం అందుతుందని నిజాం ఆశించాడు. అంతకుముందు బ్రిటిష్ వారి నుంచి ఆయనకు ఎటువంటి మద్దతు లేదు. కోస్తా ప్రాంతాన్ని 1823లో చివరిగా మద్రాస్ ప్రెసిడెన్సీకి అప్పగించవలసి వచ్చింది. 1800 సంవత్సరంలో నిజాం బ్రిటిష్ వారి రక్షణ కోరుతూ సబ్సిడీయరీ అలయన్స్ లో చేరడంతో హైదరాబాద్ లో బ్రిటిష్ సైన్యాన్ని ఉంచినందుకుగాను తాను చెల్లించవలసిన బకాయిల స్థానంలో కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాడు.

కోస్తా ఆంధ్రని బ్రిటిష్ వారికి అప్పగించడం వల్ల ఎన్నో తీవ్రమైన ప్రభావాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ భూభాగంలో దిగ్బంధనం అయింది. చివరి నిజాం స్వతంత్రంగా ఉండాలా లేదా పాకిస్తాన్ని చేరాలా అన్న ప్రత్యామ్నాయం ఎదురుగా వచ్చినప్పుడు సముద్ర తీరం నుంచి తనకి తీరమార్గం వెలుపల ఉండాలని భావించాడు.

బ్రిటిష్ రెసిడెంట్ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉండేందుకు అనుమతించడం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడీయరీ అలయన్స్ లో చేరిన తొలి వ్యక్తి నిజాం అలీ. రెసిడెంట్ తో పాటు ఉన్న బ్రిటిష్ సైన్యం ఖర్చును నిజాం భరించేవాడు. బ్రిటిష్ నుంచి తనకి రక్షణ లభిస్తోంది కనుక, దానికి ఖర్చు అవుతోంది కనుక, పొదుపు చర్యల్లో భాగంగా నిజాం తన సొంత సైనిక దళాన్ని రద్దు చేయవలసి వచ్చింది. స్థానిక సైన్యం రద్దు కావడంతో తమ ఉపాధి కోల్పోయిన సైనికులు నిజాంపై అసంతృప్తి, అసహనం పెంచుకున్నారు. వారి ఆగ్రహమే 1857లో మొదటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిబింబిoచింది.

ఈ సమయంలోనే తుర్రే బాజ్ ఖాన్ హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ పై దాడి చేశాడు. ఆ సాహసోపేతమైన దాడికి గుర్తింపుగా హైదరాబాద్ లో రెసిడెన్సీ రోడ్ కి తుర్రే బాజ్ ఖాన్ పేరు పెట్టారు.

18వ శతాబ్దం రెండో భాగంలో రెండవ అసఫ్ జాహ, నిజాముల్ ముల్క్, మీర్ నిజాం అలీ ఖాన్ మరాఠాలతో తరచూ ఘర్షణ పడేవాడు. 1853లో అయిదవ అసఫ్ జాహ అఫ్జల్ఉద్దౌలా మీర్ తెహనీయత్ అలీ ఖాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తనకి ఇచ్చిన రక్షణకి గానూ అత్యంత పుష్కలమైన పత్తి పంట పాండే బేరార్ రాష్ట్రాన్ని కంపెనీకి అప్పగించవలసి వచ్చింది. బేరార్ ను బ్రిటిష్ ప్రభుత్వం 1903లో అధికారికంగా చేర్చుకుంది.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం