వీడియోను దాటవేయి

ప్రాచీన దక్కను

హైదరాబాదుకు రెండు వేల ఏళ్లకు పైగా సనాతనమైన ఘన చరిత్ర, వారసత్వం ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రం తూర్పు, పశ్చిమ దిశల్లో సముద్ర తీరాలను తాకుతూ విస్తరించిన దక్కన్ పీఠభూమి. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుంచి, క్రీస్తు శకం మూడవ శతాబ్దం వరకు శాతవాహన వంశం వారిచే పరిపలించ బడింది. శాతవాహన కాలం సుమారు 450 ఏళ్ల పాటు కొనసాగి, దక్కన్ ప్రాంతంలో తొలి సామ్రాజ్యంగా ప్రాభవం సాధించిందని పురాణ గ్రంధాలు తెలియచేస్తున్నాయి. ఆ తర్వాతి కాలంలో వాకాటక రాజ్యం నుంచి ఒక భాగంగా విడివడిన ఈ రాజ్యాన్ని అయిదు, ఆరు శతాబ్దాల్లో విష్ణుకుండినులు, ఆ తర్వాత చాళుక్యులు పాలించారు. ఆ తర్వాత ఓరుగల్లుకు చెందిన కాకతీయ వంశస్తుల పాలన 12 నుంచి 14 శతాబ్దాల వరకు కొనసాగగా, 1323లో తుగ్లకులు కాకతీయులను పదవీచ్యుతులను చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. కాకతీయులు ఆధునిక హైదరాబాద్ నగరం సమీపంలో గోల్కొండ కోట కూడా నిర్మించారు. కాకతీయ వంశ పాలన అంతం కావడం, ఆ తర్వాత ముస్లిం దురాక్రమణతో దక్కన్ ప్రాంతం అంతా అరాచకత్వం, అయోమయం నెలకొన్నాయి. అనంతర కాలంలో కాకతీయుల రాజ్యంలో సైన్యాధిపతులు అయిన ముసునూరి నాయకులు తెలుగు ప్రాంతాలన్నింటినీ ఏకం చేశారు

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం