వీడియోను దాటవేయి

భారతదేశంతో ఏకీకరణ

ఆపరేషన్ పోలో ముగియడంతో హైదరాబాద్ ను భారత దేశంలోకి విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ఒక కొత్త అధికార శ్రేణి, కొత్త ప్రభుత్వ నియామకం, మొదటి ఎన్నికలు, ఆ తర్వాత భాషాపరంగా రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించడం, ఆ భాగాలను తరవాతి కాలంలో పొరుగు రాష్ట్రాలతో కలపడం జరిగాయి.

దీనితో నిరంకుశ, నియంతృత్వ భూస్వామ్య పాలకుల నుంచి హైదరాబాద్ సామాజిక విమోచన కూడా ప్రారంభమైంది. ఈ విమోచన హైద్రాబాద్ వాసులకు ఊరట కలిగించడమే కాక , ఒక ఆధునిక, సమాన, ప్రజాస్వామ్యం, పాలనా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చింది.

సైనిక గవర్నర్ గా నియమితులైన మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌదరి ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించి, హైదరాబద్ లో శాంతి భద్రతలు కాపాడేందుకు, స్వతంత్ర భారతంలో రాజకీయంగా విలీనమయ్యేందుకు అవసరమైన అనేక చర్యలు తీసుకున్నారు.

నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అమానుష హింసాకాండకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తమ ప్రాణాలు అర్పించిన లక్షలాది మంది సామాజిక, రాజకీయ కార్యకర్తలు, నాయకుల త్యాగ ఫలమే ఈ విజయం. అకుంఠిత కర్తవ్య దీక్ష, దార్శనికత, సమర్థ నాయకత్వంతో, సకాలంలో నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకున్న సర్దార్ పటేల్ కి పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఎంతగానో రుణపడి ఉన్నారు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం