వీడియోను దాటవేయి

నిజాం లొంగుబాటు మరియు హైదరాబాద్ విముక్తి

తన ఓటమి అనివార్యమని గ్రహించిన నిజాం సెప్టెంబర్ 17వ తేదీన కాల్పుల విరమణ ప్రకటించాడు. ముందు ఎంతో తెగువ కనబరిచిన నిజాం, ఆయన కమాండర్ అల్ అద్రూస్, రజాకార్ నాయకుడు ఖాసిం రిజ్వీతో పాటు హైదరాబాద్ సైన్యం ఐదు రోజుల్లోపు భారత ప్రభుత్వానికి తల వంచి లొంగిపోయింది. గృహ నిర్బంధంలో ఉన్న KM మున్షీని విడుదల చేశారు.

1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత బ్రిటన్ నుంచి స్వాతంత్రం సాధించిన ఏడాదికి పైగా కాలం గడిచిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి విమోచన లభించింది. మేజర్ జనరల్ చౌదరిని గవర్నర్ గా నియమించారు. అప్పటి హోం మంత్రి భారత తొలి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా మెరుపు వేగంతో సకాలంలో తీసుకున్న చర్య కారణంగా హైదరాబాద్ విమోచన సాధ్యపడింది.

సెప్టెంబర్ 18 వ తేదీ ఉదయం భారత సైన్యం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోకి తన జైత్రయాత్ర కొనసాగించడంతో రహదారుల వెంబడి లక్షలాది మంది ప్రజలు భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ఉద్వేగంగా వారికి స్వాగతం పలికారు.

1949 ఫిబ్రవరిలో హైదరాబాద్ సందర్శించిన సర్దార్ పటేల్ విమానం వద్ద తనకు స్వాగతం పలికేందుకు నిజాం వేచి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. తన కార్యదర్శి విద్యాశంకర్ తో ఆయన ఇలా వ్యాఖ్యానించారుట:

“ఓహో మహారాజశ్రీ నిజాంగారు భూమికి దిగి వచ్చారు”

సర్దార్ పటేల్ ఎంతో ఉదారంగా ఇలా ప్రకటించారు:

“His excellency నేను మిమ్మల్ని కలుసుకుని మీ పరిచయం చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా మారడం నాకు ఆనందం కలిగిస్తుంది. పొరపాటు చేయడం మానవ సహజం కానీ మర్చిపోవడం క్షమించడం ఉత్తమమని దైవిక సిద్ధాంతాలు సూచిస్తున్నాయి”

ఖాసిం రిజ్వీపై విచారణ జరిపి అసంఖ్యాకమైన నేరాలకు గాను ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ హత్యా నేరంపై రిజ్వీకి శిక్ష పడింది. అనంతరం అతను పాకిస్తాన్ వలస వెళ్లిపోయాడు. ప్రధానమంత్రి లాయక్ ఆలీ కూడా తప్పించుకుని పారిపోయి పాకిస్తాన్ చేరుకున్నాడు. వేలాది మంది రజాకార్లను జైల్లో నిర్బంధించారు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం