వీడియోను దాటవేయి

చర్చలు & స్టాండ్‌స్టిల్ ఒప్పందం

నిజాం ఇటువంటి దారుణమైన అసంబద్ధమైన డిమాండ్లు చేసినప్పటికీ సర్దార్ పటేల్ ఎంతో సహనంతో ఓర్పుతో తన చర్చలను కొనసాగించారు.చర్చలు కొనసాగుతున్న ప్రక్రియలో ఇతర సంస్థానాల మాదిరిగా నిజాం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పైన సంతకాలు చేసే ఉద్దేశం లేనట్లు స్పష్టమైంది. తొందరపడి కఠినంగా నిర్ణయం తీసుకోకూడదన్న ఉద్దేశంతో సర్దార్ పటేల్ స్టాండ్ స్టిల్ - యథాతథా ఒప్పందం పైన సంతకాలు చేసేందుకు అంగీకరించారు. ఆ తర్వాత త్వరలోనే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిసన్ విలీన పత్రంపై కూడా నిజాం సంతకాలు చేస్తాడని ఆయన ఆశించారు. రాజకీయాల్లో కొన్ని సార్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయ కాక ఆ తర్వాత రెండో పెద్దదానికి అంగీకరించవలసి వస్తుందని సర్దార్ పటేల్ విశ్వసించారు.K.M. మున్షిని భారత్ ఏజెంట్ జనరల్ గా హైదరాబాద్ కు పంపగా నిజాం మున్షీ పట్ల ఎంతో శత్రుత్వంగా వ్యవహరిస్తూ ఆయనకు కనీసం సరైన నివాసం కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టాడు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం