వీడియోను దాటవేయి

నేపథ్యం

పరిస్థితి చేయి దాటి పోతుండడంతోనూ, ఇంకే ప్రత్యామ్నాయము లేదన్న విషయం స్పష్టం కావడంతో హైదరాబాద్ కి భారత సైన్యాన్ని పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1948 సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ తుది నిర్ణయం తీసుకొని దక్షిణాది కమాండ్ కు సమాచారం అందచేశారు. 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున భారత సైనిక దళాలు హైదరాబాద్ లోకి ప్రవేశించాలని ఆదేశించారు.

అప్పుడు దక్షిణాది కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ జి ఆదేశాల మేరకు మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌదరి భారత సైనిక దళాలకు నేతృత్వం వహించారు. సైనిక కేంద్ర కార్యాలయం ఈ సైనిక చర్యకు “ఆపరేషన్ పోలో” అని నామకరణం చేసింది.

ఇంక తనకు గత్యంతరం లేదని, దారులు మూసుకుపోయాయని గ్రహించిన నిజాం అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు చివరి ప్రయత్నం చేశాడు. అయితే ఏ దేశం కూడా తనకి సహాయ పడేందుకు సిద్ధంగా లేదని అర్థం కావడంతో తానే స్వయంగా భారత సైన్యంతో పోరాడాలని సిద్ధపడ్డాడు. రెండు లక్షల మంది రజాకార్లు, 42,000 మంది రాష్ట్ర పోలీస్ సిబ్బంది అనేక మంది పఠాన్ పోరాటవాదులు భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ని కాపాడాలని ముస్లిం పౌరులందరికీ కూడా నిజాం ఎంతో భావోద్వేగంతో విజ్ఞప్తి చేశాడు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం