వీడియోను దాటవేయి

ఫలీకరించని చర్చలు

మహాత్మా గాంధీ హత్యానంతరం, ఆ తర్వాత సర్దార్ పటేల్ కి గుండెపోటు వచ్చిన తర్వాత నిజాం, ఆయన దర్బార్ లో వారు మరింతగా పేట్రేగిపోయారు. హైదరాబాదును బలవంతంగా విలీనం చేస్తే రాష్ట్రంలో ముస్లింలు దక్షిణాది ప్రాంతం యావత్తులో అశాంతి, అలజడి సృష్టిస్తారని త్వరలోనే భారతదేశంలో ఉన్న 45 మిలియన్ ముస్లింలు కూడా వారితో చేతులు కలుపుతారని బెదిరింపులు చేశారు. కాసిం రిజ్వీ నేతృత్వంలో రజాకార్ దళం హైదరాబాద్ లోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తన ఉగ్రదాడులను కొనసాగించింది.

1947 అక్టోబర్ 27వ తేదీన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని రజాకార్లు బందీలుగా పట్టుకున్నారు. అదే రోజు కాసిం రిజ్వీ నిజాం రాజప్రసాదం బయట ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాడు. అనంతరం ఢిల్లీకి ప్రతినిధి బృందానికి కాసిం రిజ్వీ నేతృత్వం వహించడం సర్దార్ పటేల్ కు ఎంతగానో ఆగ్రహం కలిగించింది. కోపోద్రిక్తుడైన సర్దార్ పటేల్ అదే విమానంలో వారిని వెనక్కి పంపాలని నిర్ణయించారు. ఆ తర్వాత లాయక్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం తన వద్దకు వచ్చినప్పుడు సర్దార్ పటేల్ వారికి సర్దార్ నిర్ద్వందంగా ఇలా చెప్పారు:

“ఇతర రాష్ట్రాల మాదిరిగానే హైదరాబాద్ సమస్యను కూడా పరిష్కరించవలసి ఉంటుంది. ఇంకే ఇతర మార్గం సాధ్యం కాదు. మేము రక్తం, స్వేదం, శ్రమతో నిర్మించిన దేశాన్ని ధ్వంసం చేసే ఒక ప్రదేశం, అదే విధంగా అదే స్వరూపంలో ఈ దేశంలో కొనసాగడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించలేము. అయితే మేము ఒక మైత్రి పూర్వకమైన పరిష్కారం కనుగొనాలని కూడా భావిస్తున్నాము. అంటే దీని అర్థం హైదరాబాద్ స్వాతంత్రానికి మేము అంగీకరిస్తామని మాత్రం కాదు”

లార్డ్ మౌంట్ బాటన్ నిష్క్రమణతో సి. రాజగోపాలాచారి భారత్ గవర్నర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. ఇది కొత్త అవకాశం గా చూసిన రజాకార్లు, హైదరాబాద్ రాష్ట్ర సరిహద్దులను దాటి బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో హిందువులను భయాందోళనలకు గురిచేసే కార్యకలాపాలు కొనసాగించారు. సౌదీ అరేబియాకి చెందిన వైమానిక దళం భారత్ లో ప్రధాన నగరాలపై దాడులు చేస్తుందని బాంబులు కురిపిస్తుందని కూడా బెదిరించారు. సెప్టెంబర్ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వానికి కొన్ని విదేశీ మిషనరీల పై దాడులు జరిగాయని రజాకార్లు కొంతమంది క్రైస్తవులపై దాడి చేశారని ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్ ముస్లిం రాష్ట్రం కావడంతో హిందువులందరూ కూడా ముస్లింలుగా మారాలని లేదా మరణం ఎదుర్కోవాలని కాసిం రిజ్వీ హెచ్చరించాడు.

1948 జనవరి 10వ తేదీన మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఒమండూరు రామస్వామి రెడ్డి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ కి ఒక లేఖ లో సరిహద్దు గ్రామాల్లో రజాకార్లు తరచూ దాడి చేస్తున్నారని సైనిక చర్య చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం