వీడియోను దాటవేయి

రాచరిక రాష్ట్రాల ఏకీకరణ

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి బ్రిటన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. క్లెమెంట్ ఆట్లీ నేతృత్వంలో లేబర్ ప్రభుత్వం 1946లో అధికారంలోకి రాగానే భారత్ కు ఒక క్యాబినెట్ బృందాన్ని పంపించింది, భారత స్వాతంత్రం గురించి వైస్రాయ్ లార్డ్ వొవెల్ తోనూ భారతీయ నాయకులతోనూ చర్చించేందుకు ఈ ప్రతినిధి బృందం వచ్చింది, అయితే రాజకీయ పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఈ మిషన్ విఫలమైంది, భారత ఉపఖండం నుంచి బ్రిటన్ ఉపసంహరణ అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తప్పనిసరిగా గోచరించడంతో 1947 ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటన్ ప్రధానమంత్రి సర్ క్లమెంట్ అట్లీ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఒక ప్రకటన చేశారు. 1948 జూన్ కల్లా బ్రిటన్ ఒక బాధ్యతాయుతమైన భారతీయ ప్రభుత్వానికి అధికారాన్ని బదిలీ చేస్తుందని రాజ్యాంగ పరిషత్ రచించే రాజ్యాంగం కింద ఎన్నిక అయ్యే ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన ప్రకటించారు.

అయితే సంస్థానాల భవిష్యత్తు ఏమిటి అనేది ఇంకా అనిశ్చితంగానే కొనసాగింది. బ్రిటిష్ భారతదేశంలో ఒక శతాబ్ద కాలంలో సంతకాలు చేసిన వివిధ ఒప్పందాలు ఆధారంగా సంస్థానాల సంబంధాలు ఉండేవి. అన్ని సంస్థానాలు కూడా బ్రిటన్ ప్రభుత్వానికి తమ రాష్ట్రంలో అత్యధిక అధికారాలు ఉండేలాగా అంగీకరించడం అనేది ఉమ్మడిగా ఉన్న అంశం. అంటే రాచరిక రాష్ట్రాలు, తమ సొంత చట్టాలు, తమ పాలకులకు వారసత్వ నిబంధనలు చివరికి తమ సొంత సైన్యాలు, కరెన్సీ కలిగి ఉన్నప్పటికీ అప్పటి భారత ప్రభుత్వానికి బ్రిటిష్ రెసిడెంట్ల ద్వారా ఆ రాష్ట్రంలో జోక్యం చేసుకునే అధికారం ఉండేది.

ఈ పరిస్థితుల్లో 1947 జూన్ మూడవ తేదీన బ్రిటన్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళిక ప్రకారం భౌగోళిక దూరం బట్టి లేదా ప్రజల అభీష్టం మేరకు సంస్థానాలు భారత్ లో కానీ పాకిస్తాన్లో కానీ చేరేందుకు ప్రత్యామ్నాయాలను వారి ముందు ఉంచుతారు.

అంతేకాకుండా బ్రిటన్ 1948 జూన్ వరకు సమయం తీసుకున్నప్పటికీ 1947 ఆగస్టు 15వ తేదీనే అధికరాన్ని బదిలీ చేస్తానని కూడా ప్రకటించింది, రెండు నెలల కాలంలో రాజ్యాంగం సిద్ధం కాదు కనుక బ్రిటన్ రాజ్యాంగం కింద ఎన్నికైన ప్రభుత్వానికి కాకుండా రాజ్యాంగం ఇంకా రూపొందుతున్న తరుణంలో ఒక మధ్యంతర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్తుంది అన్నది స్పష్టమైంది.

అతి వేగంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల మధ్య సంస్థానాల పాలకులు అయోమయానికి గురయ్యారు. బ్రిటన్ భారత్ ను విడిచి వెళ్ళినప్పుడు సంస్థానాల గతి ఏమిటి? భారత్ లో కానీ పాకిస్థాన్లో కాని చేరడం తమకు తప్పనిసరి చేస్తారా? రెండు దేశాల నుంచి తాము స్వాతంత్రం కోరుకోగలుగుతామా? తమ రాష్ట్ర సైన్యం చట్టాలు పోలీసుల పరిస్థితి ఏమిటి? తమ వ్యక్తిగత సంపద, కుటుంబం, వంశం గతి ఏమిటి? ముందు ఒక మధ్యంతర ప్రభుత్వంతోనూ ఆ తర్వాత కొత్త రాజ్యాంగం కింద ఎన్నికయిన ప్రభుత్వంతోనూ తాము ఇక పని చేయవలసి ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ సంస్థానాల ఎదుట సవాళ్లుగా నిలిచాయి.

అనేక శతాబ్దాల పాటు భారత సరిహద్దుల్లో ఉన్న సంస్థానాలు భారత్ కు స్వాతంత్రం రాగానే వివిధ రకాల సవాళ్లను ముందుకు తీసుకువచ్చాయి. వారికి ఇచ్చిన రక్షణ అంతం కావడంతో వారు భారత్ లేదా పాకిస్తాన్ లను ఎంచుకోవడం లేదా సాంకేతిక స్వయం ప్రతిపత్తి కోరుకునే పరిస్థితి వచ్చింది.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం